సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో ఇటీవల కాలంలో ‘నిత్యా కళ్యాణం పచ్చ తోరరణం’ లా ఆధ్యాత్మిక కార్యక్రమాల శోభలో.. శ్రావణమాసం 5 వ శుక్రవారం సందర్బంగా నేడు, సామూహిక వరలక్ష్మి వ్రతములు అత్యంత వైభవముగా నిర్వహించారు. దేవాలయ విశాల ఆవరణలో పందిళ్లు ఏర్పాటు చేసి అద్భుతం గా.. అలంకరణ చేసిన శ్రీ మహాలక్ష్మి ఉత్సవమూర్తి. భక్తులను విశేషం గా ఆకట్టుకోవడమే కాక, భక్తులు చాలా ఆనంద పారవస్యము చెందారు.. శ్రీ వరలక్ష్మి వ్రతాలను బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తముగా అర్చకులు గణపతి పూజతో మొదలు పెట్టి ఘనంగా నిర్వహించారు. 1500 మంది మహిళ భక్తులు ఈ వ్రతములో పాల్గొన్నారని మరియు వ్రతములో పాల్గొన్న మహిళ భక్తులకు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి పుట్టింటి వారుగా పేరున్న మెంటే వంశస్తులు శేషవస్త్రం బహుకరించారు మరియు 3000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని , ఈ కార్యక్రమంకి దేవస్థానం సిబ్బంది, దేవదాయశాఖ, పోలీస్, మునిసిపల్ తదితర అధికారులు, స్థానిక పెద్దలు సహకారం అందించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *