సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో రేపు ఆదివారం ఉదయం ( డిసెంబర్ 8).హైదరాబాద్ , SBI కాలనీలో ఉన్న “నవ గోపికా సంఘం” కు చెందిన కె. సుజాత, యు.నాగమణి తదితరులు ఆధ్వర్యములో శ్రీ మావుళ్ళమ్మ సన్నిధి ప్రాంగణంలో “పృథ్వీ శ్రీ చక్రము” వేసి, శ్రీ చక్రార్చన పూజ చేయాలని సంకల్పించడం జరిగింది. అనంతరం శ్రీదేవి ఖడ్గమాల, ఆ తదుపరి శ్రీ లలిత సహస్ర నామ పారాయణం జరుగుతుంది అని దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ తెలిపారు.కావున భక్తులందరు కూడా దీనిని ఒక దీక్షగా భావించి ఈ కార్యక్రమం లో పాల్గొని దిగ్విజయంగా జరగాలని కోరుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని .దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ కోరారు..
