సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, శుక్రవారం మధ్యాహ్నం తెలుగువాడు.. ప్రఖ్యాత ఇండియన్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ వారికి ప్రత్యేక పూజలను నిర్వహించి ఆశీర్వచనం అందించారు. వీరు ఈనెల 8 నుంచి జరగనున్న ఆంధ్రా ప్రీమియం లీగ్ టీమ్ లో భీమవరం బుల్స్ టీమ్ కు కెప్టన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ పోటీల్లో విజయం సాధించాలని వారు ధరించే జెర్సీ కు శ్రీ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదాలు వీరికి అందించారు. ఈ ఏడాది లో నితీష్ కుమార్ రెడ్డి శ్రీ మావుళ్ళమ్మవారిని 2వ సారి దర్శించుకోవడం గమనార్హం..
