సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు దేవస్థానం యొక్క ఉపాలయం అయినటువంటి విశేష మహిమాన్వితమైన అశ్వత్త గణపతి సన్నిధానం లో.. గణపతి నవరాత్రులలో భాగంగా.పర్యావరణ హితమైన మట్టి వినాయకుణ్ణి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో..అర్చకులు నేటి బుధవారం ఉదయం ప్రతిష్టాపన చేసి పూజలు నిర్వహించారని, కొన్ని సంవత్సరాల తరువాత. విగ్నేశ్వస్వామి ప్రాముఖ్యత రోజు అయిన.. బుధవారం నాడు వినాయక చవితి పర్వదినం వచ్చింది అని.. ప్రజలకి.. సర్వ శుభాలు..కలుగుతాయి అని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు గణపతి నవరాత్రులు సందర్బంగా.. ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి అని.. 6 వ తేదీ నాడు. నిమజ్జనం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, స్థానిక నీరుల్లి పండ్ల కాయగూరలు వర్తక సంఘం. ప్రతినిధి కొప్పుల సత్తిబాబు. తదితరులు హాజరయ్యారు
