సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు ధనత్రయోదశి సందర్భంగా భక్తులు సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈనెల 18 వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు శ్రీ అమ్మవారి ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మీ ధనపూజతో పాటుగా శ్రీ మహావిష్ణు స్వరూప ధన్వంతరీ పూజ దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నామని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్, బుద్ధమహాలక్ష్మి నగేష్ తెలియచేసారు. కావున భక్తులు 17 వ తేదీ సాయంత్రం 5 గంటల ముందుగా దేవస్థానం ప్రాంగణంలో కౌంటర్ నందు శ్రీ మహాలక్ష్మి ధన పూజ కొరకు గోత్రనామాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. అదే రోజున జరిపే ధన్వంతరి పూజ సందర్భంగా ఈ నెల 15 వ తేదీ నుండి 17 వ తేదీ వరకు ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని ప్రముఖ ఆయుర్వేద ప్రభుత్వ వైద్యులు డాక్టర్ అయ్యగారి శ్రీరామ్, నేతృత్వం లో నిర్వహిస్తున్నామని, దేవస్థానం ప్రాంగణంలో 15 వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు…16 వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు,… 17 వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు డాక్టర్ గారి వద్ద పరీక్షలు చేయించుకున్నవారికి ..అవసరమైన మందులు నిర్ధారించిన జాబితాలు సిద్ధం చేసి 18 వ తేదీ శనివారం సాయంత్రం శ్రీ మహాలక్ష్మీ ధనపూజతో పాటు జరిపే ధన్వంతరి పూజ అనంతరం ఆయుర్వేద మందుల కిట్టు పరీక్షలు చేయించుకొన్న భక్తులకు ఉచితంగా అందించబడునని, ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మినగేష్ తెలియచేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *