సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ వార్షికోత్సవ సందర్భంగా నేడు, శుక్రవారం (ది 5- 12- 2025) ఉదయం 9 గంటల 45 నిమిషాలకు పందిరి రాట ముహూర్తము జరిపించుట జరిగినది అని నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం సభ్యులు మరియు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రకటించారు. వచ్చే 2026 జనవరి నెల లో సంక్రాంతి నుండి నెల రోజుల పాటు జరిగే వార్షికోత్సవాలుకు చలువ పందిళ్ళ ఏర్పాటు పనుల కోసం నేడు వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ అమ్మవారి అస్సిసులు కోరుతూ రాటా కార్యక్రమం లో దేవాలయ సహాయ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి నగేష్ పాల్గొన్నారు.
