సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు బ్రహ్మ వర్చస్సుతో నిండుగా నిలిచే సూర్య చంద్రులను అలంకార భూషితాలుగా.. ప్రకృతి అంతా పూమాలలుగా ధరించే సాక్షాత్తు.. శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా భక్తులు భావించే శ్రావణ మాసంలో భాగంగా నాలుగవ శుక్రవారం అనగా ఆగస్టు 15 వ తేదీ ఉచిత సామూహిక వరలక్ష్మీ పూజలను దేవస్థానంలో నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ తెలిపారు. ఈ ఉచిత వరలక్ష్మీ వ్రతములో పాల్గొనే మహిళా భక్తులు దేవస్థానం కౌంటర్ నందు ఆగస్టు 10వ తేదీ లోపు పేరు, గోత్రములు ఫోన్ నెంబర్లు తో సహా నమోదు చేసుకోవాలని అలాగే ఎనిమిది వందల మంది భక్తులు వరకు ఈ వ్రతంలో పాల్గొనటానికి అవకాశం ఉంటుందని 800 మంది మహిళా భక్తులు పేర్లు నమోదు కాగానే నమోదు నిలిపివేయడం జరుగుతుంది అని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు. ….ఈ శ్రావణ మాసంలో శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం ప్రాంగణంలో మహిళలు అశ్వత్థ వృక్షం వద్ద దీపాలు వెలిగించుకొని… శ్రీ అమ్మవారి దర్శన అనుగ్రహంతో సిరి సంపదలు పొందే అవకాశం కల్పించారు.
