సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారు దసరా మహోత్సవాలలో 11వ రోజు.. నేడు, సోమవారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. శ్యాం సిల్క్స్ రమేష్ అగర్వాల్ దంపతుల సోజన్యంతో అలంకారం జరిగింది. నేటితో అవతారాలు ముగింపు విజయదశమి పండుగ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించారు. నేటి ఉదయం 7 గంటలకు దసరా ప్రత్యేక పూజ తదుపరి వేద పండితుల మంత్రోచ్ఛరణలతో ‘చండి హోమం’ ఘనంగా నిర్వహించారు. కుంకుమ అర్చన లు ఎక్కువ స్థాయిలో ఘనంగా జరిగాయి. మధ్యాహ్నం శ్రీ అమ్మవారి నగర ఊరేగింపు కోసం ప్రత్యేక రధాన్ని అధిరోహించారు. నేటి మధ్యాహ్నం 4 గంటల నుండి ఆలయ కళా వేదికపై పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి.దసర వేడుకలు ముగింపుగాఎల్లుండి .. ఈ నెల 4వ తేదీన శనివారం ఉదయం 10 గంటల నుండి అఖండ అన్న సమారాధన ను ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ప్రారంభిస్తారని భక్తులు హాజరయి శ్రీ అమ్మవారి ప్రసాదం స్వీకరించాలని దేవాలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
