సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారు దసరా మహోత్సవాలలో 9వ రోజు.. నేడు, సోమవారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. శ్యాం సిల్క్స్ రమేష్ అగర్వాల్ దంపతుల సోజన్యంతో అలంకారం జరిగింది. నేటితో అవతారాలు ముగింపు విజయదశమి పండుగ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు శ్రీ అమ్మవారిని దర్శించారు. నేటి ఉదయం 7 గంటలకు దసరా ప్రత్యేక పూజ తదుపరి 8 వేద పండితుల మంత్రోచ్ఛరణలతో ‘చండి హోమం’ ఘనంగా నిర్వహించారు. కుంకుమ అర్చన లు ఎక్కువ స్థాయిలో ఘనంగా జరిగాయి. మధ్యాహ్నం శ్రీ అమ్మవారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. నేటి మధ్యాహ్నం 3 గంటల నుండి ఆలయ కళా వేదికపై భజన, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు తో పాటు నేటి రాత్రి 7గంటల నుండి శ్రీ మావుళ్ళమ్మ బృందం చే సంగీత విభవారి కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ దసరా వేడుకలు ముగింపుగా ఈ నెల 27 శుక్రవారం ఉదయం 10 గంటల నుండి అఖండ అన్న సమారాధన ను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభిస్తారని భక్తులు హాజరయి శ్రీ అమ్మవారి ప్రసాదం స్వీకరించాలని దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మెన్ మానేపల్లి నాగేశ్వర రావు, మరియు దేవాలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రజీ తెలిపారు.
