సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: SSMB29 లో రాజమౌళి , మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమా టీజర్ ను మరి కొద్దీ రోజులలో.. ప్రపంచ నెంబర్ 1 అవతార్ దర్శక నిర్మాత జేమ్స్ కామెరూన్ విడుదల చేస్తున్నారని, ఆ టీజర్ ప్రపంచ వ్యాప్తంగా అవతార్ 3 రిలీజ్ అయ్యే థియేటర్స్ లో కూడా ప్రదర్శితమవుతుందని ప్రచారం జరుగుతుండగానే.. సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు రాజమౌళి మరో పెద్ద ట్విస్ట్ ఇవ్వనున్నాడట. మునుపెన్నడూ లేనివిధంగా ఈ సినిమాలో కొద్దీ సేపు.. మహేష్ శ్రీరాముడిగా కనిపించనున్నాడని సినిమా సెకండాఫ్ లో వచ్చే సీన్స్ కోసం రాముడి గెటప్ లో మహేష్ కనిపించనున్నాడట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన షూట్ కూడా పూర్తిచేశారని ఫిల్మ్ నగర్ టాక్ ప్రచారం లో ఉంది. కల్కి సినిమా లో ప్రభాస్ కర్ణుడిగా కనిపిస్తేనే సినిమా అదిరిపోయింది. మరి ప్రపంచ అందగాడు మహేష్ పురాణ, చారిత్రక పురుషుడు, నిజమైన హీరో శ్రీ రాముడు పాత్రలో కనిపిస్తే.. ఇక ఇదే కనుక నిజమైతే థియేటర్లు బద్దలవ్వడం ఖాయమని చెప్పొచ్చు
