సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా వేడుకలలో భాగంగా భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారు నేడు, శ్రీ లలితా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నేడు, అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం రోజు అని భక్తులు భావించే రోజు కావడంతో విశేషంగా మహిళా భక్తుల సందడి మరింత పెరిగింది. నిన్న నేడు, భవాని మాల వేసుకొన్న భక్తుల సంఖ్యా కూడా పెరిగింది. దసరా రాత్రులు ఆలయ ఆవరణలో పందిళ్లు, లైటింగ్ అలంకారాలు, సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరిస్తున్నాయి.
