సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నూతన దర్శకుడు యదునాథ్ మారుతీ రావును దర్శకుడిగా పరిచయం చేస్తూ ;మెడ్ ఇన్ భీమవరం’ హీరో శ్రీవిష్ణు నటించిన ఈ శుక్రవారం ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam) నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘విష్ణు విన్యాసం’ ఎలా ఉందో తెలుసుకుందాం… కధానాయకుడు విష్ణు (శ్రీవిష్ణు)కు వాస్తు అంటే చాల సెంటిమెంట్. . ఏ పని చేయాలన్నా వాస్తునే ఫాలో అవుతుంటాడు. దానికి తోడు న్యూమరాలజీనీ నమ్ముతుంటాడు. కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న అతని జీవితంలోకి ఊహించని విధంగా హెచ్.ఓ.డి. రూపంలో మనీషా (నయన్ సారిక Nayan Sarika) ప్రవేశిస్తుంది. . ఆమె తనకున్న విచిత్ర అలవాట్లతో మొదటి రోజే విష్ణుకు దిమ్మతిరిగేలా చేస్తుంది. తామిద్దరి జాతకాలు కలవడంతో ఆమెలోని లోటుపాట్లను పక్కన పెట్టి విష్ణు కూడా ఆమెను ప్రేమించడం మొదలు పెడతాడు. ఇక పెళ్ళి చేసుకోవడమే తరువాయి అనుకుంటున్న సమయంలో ఆమెకు రెండు మంగళ సూత్రాల దోషం ఉందని తెలుస్తుంది. ఇక అక్కడ నుండి జరిగే విన్యాసాలు వెండి తెరపై చూడవలసిందే.. ఇక విశ్లేషణకు వస్తే ఇది పాత కధే.. అయితే హీరో శ్రీ విష్ణు పన్ కోసం వచ్చే ప్రేక్షకులకు మాత్రం నిరాశ పరచడు . వన్ మాన్ షో గా నడిపించాడు. తనదైన డైలాగ్ మాడ్యులేషన్‌తో శ్రీవిష్ణు చెలరేగిపోయాడు అయితే హీరోయిన్‌కు అర్థం పర్థం లేని అవలక్షణాలను అంటగట్టి దాని ద్వారా కామెడీ సృష్టించే ప్రయత్నం చేశారు.ఇతర ప్రధాన పాత్రలను సత్య (Satya), శ్రీనివాసరెడ్డి, గోపరాజు రమణ, ప్రమోదిని, బ్రహ్మాజీ, ప్రవీణ్‌, సత్యం రాజేశ్‌, మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, వడ్లమాని శ్రీనివాస్ తదితరులు పోషించారు. తెర మీద తారలు చాలామంది కనిపించినా.. వాళ్ళను దర్శకుడు పెద్దంతగా ఉపయోగించుకోలేదు శ్రీ విష్ణు కామిడి కోసం సినిమా చుసేయ్యవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *