సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని గునుపూడి గ్రామా దేవతగా 800 ఏళ్ళ చరిత్ర కలిగిన గ్రామా దేవత శ్రీశ్రీశ్రీ ఆదిలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి కి నేడు ఆదివారం ఆషాడ అమావాస్య రోజు పండ్లు కూరగాయలు, ఆకులూ అలములు తో శ్రీ శాఖంబరి దేవి అలంకారం నిర్వహించారు. ఆలయం ఆవరణ కూడా ఒక తోటను తలపించే విధంగా అందంగా కూరగాయలతో అలంకరించారు. శ్రీ అమ్మవారి అస్సిసుల కోసం విశేషంగా భక్తులు హాజరు అయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అడ్జక్షుడు కొటికలపూడి చినబాబు శ్రీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి మధ్యాహ్నం దాతల సహకారంతో భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు.
