సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 59వ వార్షికోత్సవాలు లో భాగంగా నేడు, బుధవారం శ్రీ అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు అస్సిసులు అందజేశారు. స్థానిక భక్తులు గ్రంధి వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ అలంకరణ ఏర్పాటు చేసారు. ఇక ఉత్సవాలు ఎల్లుండి శుక్రవారం తో అంటే ఈ నెల 10వ తేదీతో ముగియనున్నాయి. ఉత్సవాలలో కళా కారుల ప్రదర్శనలను నేటి బుధవారం నుండి నిలిపివేశారు. అయితే నేడు, రేపు గురువారం రాత్రుళ్ళు కూడా లైటింగ్ అలంకరణలు , భారీ తీర్ధం ను భక్తులు వీక్షించి ఆనందించవచ్చు.. ఎల్లుండి ఉదయం 8 గంటలకు శ్రీ అమ్మవారికి మహా నైవేద్యం పూర్ణ కుంభం సమర్పించాక లక్ష మంది భక్తులకు సాయంత్రం వరకు పంచ బక్ష పరమాన్నాలతో నీరుల్లి కూరగాయ సంఘం , ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహణతో ఉత్సవాలు ముగుస్తాయి.
