సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారు దసరా మహోత్సవాలలో భాగంగా నేడు, సోమవారం మూలనక్షత్రం నేపథ్యంలో చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి దేవి అవతారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఎం ప్రభాకర్ ( బ్యాటరీ మూర్తి ) దంపతుల సోజన్యంతో అలంకారం జరిగింది. భారీ క్యూ లైన్ లలో ఉన్న భక్తులు శ్రీ అమ్మవారి దర్శనం వేగంగా జరగడానికి తగిన ఏర్పాట్లు చేసారు. చూడముచ్చటైన నిలువెత్తు శ్రీ సరస్వతి అమ్మవారి అవతారం దర్శనం కోసం చిన్నారులతో పాటు తల్లి తండ్రులు హాజరై తల్లి అస్సిసులు పొందుతున్నారు. దేవాలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణలో నేటి ఉదయం నుండి లక్ష కుంకుమ అర్చన లు కు వందలాది దంపతులు హాజరు అయ్యారు. తదుపరి ఉచితంగా స్థానిక వందలాది విద్యార్థిని విద్యార్థులతో వారికీ ఉన్నత భవిషత్తు ఉండాలని, శ్రీ సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులకు పుస్తకాలూ పెన్నులు కానుకగా అందజేశారు.
