సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారు దసరా మహోత్సవాలలో భాగంగా నేడు, శుక్రవారం మూలనక్షత్రం నేపథ్యంలో చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి దేవి అవతారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఎం ప్రభాకర్ ( బ్యాటరీ మూర్తి ) దంపతుల సోజన్యంతో అలంకారం జరిగింది. ఈ దసరా రోజులలో నేడు శుక్రవారం కూడా కావడంతో భక్తులు పోట్టెత్తిపోయారు. భారీ క్యూ లైన్ లలో ఉన్న భక్తులు శ్రీ అమ్మవారి దర్శనం వేగంగా జరగడానికి తగిన ఏర్పాట్లు చేసారు. చూడముచ్చటైన నిలువెత్తు శ్రీ సరస్వతి అమ్మవారి అవతారం దర్శనం కోసం చిన్నారులతో పాటు తల్లి తండ్రులు హాజరై తల్లి అస్సిసులు పొందుతున్నారు. నేటి ఉదయం నుండి లక్ష కుంకుమ అర్చన లు ఎక్కువ స్థాయిలో ఘనంగా జరిగాయి. నేటి మధ్యాహ్నం 3 గంటల నుండి ఆలయ కళా వేదికపై భజన, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు తో పాటు నేటి రాత్రి 7గంటల నుండి కూచిపూడి నాట్యం నిర్వహిస్తున్నారు. కావున ఈ సాంసృతిక కార్యక్రమాలకు అందరు ఆహ్వానితులే.. .
