సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం వన్ టౌన్ లోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో కిష్కిందపురం లో వెలిసిన శ్రీ సీతా రామలింగేశ్వర స్వామి వారి పురాతన గుడి పునర్ నిర్మాణానికి గతంలో ప్రకటించినట్లు గానే .. స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యుల పేరిట రూ 10 లక్షల 33 వేల ను విరాళంగా ఆలయ అధికారులకు స్థానిక క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ వర్దినిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ ఆలయ పున నిర్మాణానికి సంబంధించి భక్తుల కోరిక మేరకు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రభుత్వం ద్వారా రూ కోటి నిధులను మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. అయితే భక్తుల భాగస్వామ్యంగా మూడో వంతు నిధులు 33 లక్షల 33 వేలను డిపాజిట్ చేయాల్సి ఉండడంతో, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్వయంగా కల్పించుకుని రూ 23 లక్షల వరకు భక్తుల నుండి సేకరించడం జరిగిందని అన్నారు. మిగిలిన రూ 10 లక్షల 33 వేల ను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యుల పేరిట ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం తరుపున ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కుటుంబానికి, విరాళాలు అందించిన భక్తులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. త్వరలోనే ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించి త్వరిత గతిన నిర్మాణ పనులను పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోలు తోట శ్రీనివాసరావు, కిషోర్ ,ఆలయ పాలకమండలి చైర్మన్ మందారపు శ్యాంసుందర్రావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *