సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రత్యక్ష నారాయణుడిగా ప్రతి రోజు దర్శనం ఇచ్చే శ్రీ సూర్యనారాయణ మూర్తి కి పురాణాలూ,వేదాల ఆధారంగా జన్మదినం సందర్భముగా నేడు, శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు రద సప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భీమవరం పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవాలయంలో ఉప ఆలయాలలో నవగ్రహాల ఆలయాన్ని, అరుదయిన ఎర్ర రాయితో చెక్కిన శ్రీ సూర్యనారాయణుని విగ్రహాన్ని దర్శించడానికి అభిషేకాలు చెయ్యడానికి భక్తులు విశేషంగా హాజరు అయ్యారు. ప్రతి ఇంటా హిందూ మహిళలు భక్తి శ్రద్దలతో 7 చిక్కుడు కాయలతో రధం నిర్మించి దానిలో శ్రీ సూర్యనారాయుడిని ప్రతిష్టించి చెరుకు, రేగుపండ్లతో, పరమణాల న్యివేద్యాలు పెట్టి ఆరాధించారు. ఇక కలియుగ వైకుంఠం తిరుమలలో ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. వేలాది భక్తుల సమక్షంలో స్వామివారు ఏనుగులు ముందు నడువగా మేళ తాళాలతో సూర్యప్రభ వాహనం పై తిరుమాఢ వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ స్వామివారు సప్తవాహనాలపై దర్శనమిస్తున్నారు. మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *