సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కార్తీక మాసం నాలుగవ శనివారం ( ద్వావదశి తిది) సందర్భంగా భీమవరం పంచారామ క్షేత్రమైన ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానంలో ఈరోజుశనివారం స్వామివారికి అభిషేకం ఆలయ ప్రధాన అర్చకులు చెరుకూరి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. అనంతరం శ్రీ సోమేశ్వర స్వామి వారికి లక్ష బిల్వార్చన వేద పండితులు ఘనంగా నిర్వహించారు. అనంతర సాయంకాల దర్శనం కోసం శ్రీ స్వామివారి దివ్య అలంకారం ఫై చిత్రంలో చూడవచ్చు..కార్తీకమాసోత్సవములలో భాగం గా నేడు 26 రోజు భక్తుల ద్వారా 22 అభిషేకము, ఇతర సేవలు , దర్శన టిక్కెట్లు మరియు , 354 లడ్డులు విక్రయం ద్వారా రూ.5,310/-లు మొత్తం కలపి రూ.1,34,992/-లు ఆదాయం వచ్చిందని కార్యనిర్వహణాధికారి డి రామకృష్ణంరాజు తెలిపారు. భక్తులకు తగు ఏర్పాట్ల ను ధర్మకర్తల మండలి సభ్యులు కుర్మదాసు సత్యశ్రీనివాస్, నాచుశ్రీవల్లి, లక్కు త్రిమూర్తులు, కోయతాతాజీ, నల్లం రఘుబాబు, చెల్లబోయిన సూర్యప్రకాష్, సోమాదుల లీలా ఈశ్వరి, తాణాల రామకృష్ణ పర్యవేక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *