సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పంచారామ క్షేత్రమైన భీమవరం నేడు, సోమవారం కూడా గత వేలాదిగా భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి పోటెత్తారు. శ్రీసోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ( ఫై చిత్రంలో స్వామివారి పుష్ప అలంకారం ) నేడు సోమవారం ఉదయం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు తెల్లవారు జామున స్వామివారికి పట్టు వస్త్రాలను అందించారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందన్నారు. దేవస్థాన అర్చకులు కళ్యాణ క్రతువుని శాస్త్రోక్తంగా జరిపించారు. శివ నామ స్మరణతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మికత సంతరించుకుంది. అధిక సంఖ్యలో భక్తులు కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఆలయ ఈవో, చైర్మన్, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.నేడు మధ్యాహ్నం నుండి శ్రీ స్వామివారు దేవేరులతో కల్సి రధోత్సవం లో విహరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *