సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం లో పవిత్ర పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీకమాసోత్సవములు సందర్భముగా 18వ రోజు సందర్భముగా నేడు, కార్తీక 3వ మంగళవారం సేవల వలన రూ.1,550/- దర్శనం టిక్కెట్ల వలన రూ.25,100/-లు కానుకలు/సమర్పణలవలన రూ.2,010/-లు,లడ్డులు వలన రూ.9,855/- అన్నదానం ట్రస్టు నిమిత్తం రూ.41,100/-లు, మరియు ఈ రోజు అన్నదానంనిమిత్తం పాపోలు రాధాకృష్ణమూర్తి, విశాలక్ష్మి గార్ల అల్లుడు కుమారై, అంకెం సోమయ్య, హైమావతి దంపతులు, మల్లడక సుందరరావుశెట్టి, సుధామూర్తి (సందేశ్ హోటల్) భీమవరం వారు రూ.50,000/-లు మరియు మెహార్ ఆయిల్ ఇండ్రస్ట్రీస్, మండపేట వారు రూ.50,000/- మొత్తం రూ.1,79,615/-లు అందజేశారని ఈరోజు అన్నదానం ట్రస్టు ద్వారా 3,000 మందికి అన్నప్రసాదం వితరణ నిర్వహించామని ఇఓ డి రామకృష్ణంరాజు తెలిపారు. నేడు, ఆరుద్ర నక్షత్రం శుభ సందర్భంగా నేటి సాయంత్రం శ్రీ సోమేశ్వర స్వామి వారికి అష్టోత్తర దీపాలంకరణ దర్శనం ఫై చిత్రంలో చూడవచ్చు..
