సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 చివరి అంఖంలోకి ప్రవేశిస్తుంది. జనాదరణ దృష్ట్యా ఓటింగ్ పరంగా ‘సన్నీ’ బిగ్ బాస్ విన్నర్ కానున్నాడని భావించవచ్చు.. ఇక కోట్లాది మంది చూస్తున్నారనే సృహలేకుండా ఫ్రెండ్ షిప్ అనిచెప్పుకొంటూ .. కొగిలింతలకు కరువు తీరని జంటగా కనిపిస్తున్న షణ్ముఖ్, సిరి జంట పరువు ‘అప్పడం ‘చేసిపారేసాడు సన్నీ నిన్నటి ఎపిసోడ్ లో.. విషయానికివస్తే ప్రస్తుతం మిగిలిఉన్న టాప్ 6 ఇంటి సభ్యులకు టాస్క్ లో భాగంగా గతంలో ప్రేక్షకులకు నచ్చిన ఐకానిక్ సంఘటనల్ని మరోసారి ఒకరి రోల్ మరొకరు ప్లే చేయాల్సి ఉంటుందని చెప్పారు బిగ్‌బాస్. ఎవరైతే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తారో వాళ్లకి గార్డెన్ ఏరియాలో స్పెషల్‌గా ఏర్పాటు చేసిన ఓటింగ్ బూత్ నుంచి ఆడియన్స్‌కి ఓటింగ్ అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. దీనిలో భాగంగా సన్నీ-సిరిల మధ్య జరిగిన ‘అప్పడం’వివాదాన్ని మరోసారి అలాగే చేసి చూపించాలని ఇంటి సభ్యులను ఆదేశించాడు. ఈ టాస్క్‌లో సన్నీలా సిరి, సిరిలా షణ్ముఖ్, షణ్ముఖ్‌లా సన్నీ, కాజల్‌లా శ్రీరామ్.. యానీ మాస్టర్‌లా మానస్, రవిలా కాజల్ వారి వారి పాత్రల్లో అద్భుత నటనను ప్రదర్శించారు. ముఖ్యంగా షణ్ముఖ్ పాత్ర చేసిన సన్నీ అయితే… సందు దొరికితే చాలు … సిరి పాత్రలో ఉన్న షణ్ముఖ్‌ని గట్టిగా కౌగిలి లో అదిమేస్తూ ఆంటీ ఇది ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ రోజూ షణ్ముఖ్-సిరిలు ఎలాగైతే చేస్తారో అలా చేసి నవ్వులు పూయించాడు. సన్నీ ఫెర్ఫామెన్స్‌ని తట్టుకోలేక పాత్ర నుంచి బయటకు వచ్చి.. నువ్ బాగా ఓవర్ చేస్తున్నావ్ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు షణ్ముఖ్ . దీంతో సన్నీ కొంచెం తగ్గాడు.
