సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో నేడు, శుక్రవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఒక ఫ్యాక్టరీలో గ్యాస్ ఫర్నేస్ పేలడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాద తీవ్రత బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. అయితే బాధితులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమైపోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 150 మంది ఉన్నట్లు సమాచారం.ఈ పేలుడు ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేసి,, అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు వైద్య బృందాలు ఘటనా స్థలిలోనే ఉండి సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు.
