సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహారాష్ట్ర లోని మహిమానిత సాయిబాబా మహాసమాధిని దర్శించడానికి వచ్చే భక్తుల కోసం మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా సంస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. షిరిడి కి వచ్చే భక్తులకు రూ.5 లక్షల ప్రమాద బీమాను అందించనున్నట్టు తెలిపారు. షిరిడీలో సాయిబాబా దర్శనం, భక్త నివాస్, అభిషేకం, మిగతా పూజ కార్య క్రమాల కోసం అధికారిక వైబ్ సైట్ లో బుక్చేసుకున్న భక్తులకు ఈ ప్రమాద బీమా వర్తిస్తుందని సాయిబాబా సంస్థాన్ ప్రకటించింది. దీనికోసం భక్తులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ,ఏటా 10 లక్షల మంది భక్తులకు లబ్ధి చేకూర్చేలా ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. దీనికోసం ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.48 లక్షలు చెల్లించినట్లు తెలిపారు.
