సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రతి రోజు వేలాది తెలుగు రాష్ట్రాల సాయి బాబా భక్తులు షిరిడీ కి వెళుతుంటారు. అయితే మే 1 నుండి షిరిడీ నిరవధిక బంద్ ప్రకటన తో వారు తీవ్ర నిరాశ చెందారు. అయితే మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శిర్డీలో మే 1 నుంచి బంద్ నిర్వహించాలన్న నిర్ణయాన్ని స్థానిక గ్రామస్థులు వెనక్కి తీసుకున్నారు. రాష్ట్ర రెవెన్యూ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తో భేటీ అనంతరం శిర్డీ గ్రామస్థులు ఈ విషయాన్నిప్రకటించారు. ఉగ్రవాదుల నుండి ముప్పు పొంచి ఉన్న సంకేతాల నేపథ్యంలో షిర్డీ బాబా ఆలయంలో సీఐఎస్ఎఫ్ భద్రత ఏర్పా టును భారీ స్థాయిలో పెంచి కొత్త నిబంధనలను విధించడంతో స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు వ్యతిరేకిస్తూ స్థానికులు ఇక నిరవధిక బంద్ కు పిలుపు నివ్వడం, కోర్ట్ కు వెళ్లడం .. తదితర పరిణామాల నేపథ్యంలో కేంద్రం వెనక్కి తగ్గింది. ఇకపై ఆలయ ప్రాంగణ భద్రత మహారాష్ట్ర పోలీసుల పరిధిలోకి వస్తుంది. ఆలయాన్ని ప్రతిరోజు బాంబు స్క్వాడ్ తనిఖీ నిర్వహిస్తారు.
