సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: షిరిడి సాయి భక్తులకు శుభవార్త ! భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ మీదుగా( 28వ తేదీ) నేడు, ఆదివారం మద్యాహ్నం 3న్నర గంటలకు ప్రత్యేక నగర్ సోల్ వెళ్లే ట్రైన్ వేశారు. ప్రతి రోజు నరసాపురం నుండి భీమవరం మీదుగా వెళ్లే నగర్ సోల్ రైలు కు విపరీతమైన సాయి భక్తుల రద్దీ పెరిగిపోయి 2 నెలలు ముందే టికెట్స్ బుక్ అయ్యిపోతున్న నేపథ్యంలో నేడు ఆదివారం అదనంగా ప్రత్యేక రైలు ప్రారంభించారు. ఈ రైలు నరసాపురం లో మధ్యాహ్నం 3 గంటలకు బయలు దేరి పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, విజయవాడ మీదుగా రేపు మధ్యాహ్నం సుమారు వంటి గంట సమయంలో నగర్ సోల్ చేరుకొంటుంది. ఈ ప్రత్యేక రైలు గురించి పూర్తీ వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. .
