సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంత్రి అంబటి రాంబాబు నేడు, ఆదివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, దత్తపుత్రుడు జనసేన పవన్ కల్యాణ్ మధ్య ఉన్న ముసుగు మరోసారి తొలిగిపోయింది. వీరిద్దరూ రెండోసారి సమావేశం కావడం తో టీడీపీకి జనసేన మద్దతుపై, పవన్ కి ప్యాకేజీపై మా జోస్యం నిజమైంది. జనసేన క్యాడర్ కూడా దీనిని గమనించాలి. ఇక జనసేనను టీడీపీలో కలిపేయాలి. చంద్రబాబు, పవన్ కలిసినా మాకు నష్టం లేదు. చంద్రబాబు దగ్గర పవన్ ఊడిగం చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ నైతిక విలువలు లేవు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 175 సీట్లకు 175 గెలుస్తుంది అన్నారు. అంబటి తాజా ట్విటర్లో.. సంక్రాంతికి గంగిరెద్దులా గంగిరెద్దుల పవన్ చంద్రబాబు ఇంటికి వెళ్ళాడు.. డూ డూ బసవన్నలా తలఊపడానికి.. అంటూ ట్విట్ చేసారు.. మరో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. సంక్రాంతి ప్యాకేజీ కోసమే చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లాడు. ఇప్పడు చెప్పుతో ఎవరిని కొట్టాలి పవన్ కళ్యాణ్? దత్త తండ్రి ఇంటికి దత్తపుత్రుడు వెళ్లాడు. కందుకూరు, గుంటూరుతో అమాయకులు చనిపోతే పరామర్శించలేదు. చంద్రబాబు ఇంటికి వెళ్లడం సిగ్గుగా అనిపించడం లేదా? చంద్రబాబు, పవన్ కలిసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని అంగుళం కూడా కదపలేరు.అని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *