సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి సంబరాలతో పాటు కోడి పందాల రాజధానిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో పేరొందిన భీమవరం ఇప్పుడు జిల్లా కేంద్రంగా మారిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులు ఇక్కడే ఉండటంతో ఈసారి కోడి పందాలు నిర్వహణ ఏ విధంగా నిర్వహిస్తారు? అన్న మీమాంస ఉన్నపటికీ దశాబ్దాలుగా 4 రోజుల సంక్రాంతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసే భీమవరం ప్రముఖులు రాజకీయాలకు అతీతంగా సహకరించుకొంటారని అందరికి తెలిసిందే. చోటా మోట నేతల ఆధ్వర్యంలో కోడి పందాల బరులుకు, డింకీ పందాలకు పట్టణంలోని 3 టౌన్ శివారు ప్రాంతలతో పాటు వెంప, పెదగరువు, పాలకోడేరు, ఉండి, కాళ్ల మండలాల్లోని పలు ప్రాంతాలు ప్రసిద్ధి పొందాయి. ఇప్పటికే గత క్రిస్మస్ రోజు భీమవరం నియోజకవర్గం కొణితివాడలో కోడి పందాలకు కొందరు సిద్ధం అయిపోవడం వారిపై పోలీసులు జరిగిపిన దాడిలో వారు కోళ్లను వదిలి పారిపోవడం గమనార్హం. ఏది ఏమైనా భీమవరం శివారులోని గ్రామంలో సంక్రాంతి కి సుమారు పదుల ఎకరాల స్థలంలో సంక్రాంతి వేడుకలు భారీగా నిర్వహించాలని, సాంస్కృతిక ప్రదర్శనలు, సినీ ప్రముఖులతో మ్యూజికల్ నైట్ లు తో పాటు సాంప్రదాయ కోడి పందాలు నిర్వహణకు ఏర్పాట్లు కు సన్నాహాలలో ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ మాత్రం కోడి పందాల, జూదశాలల నిర్వహణ ఫై కఠిన ఆంక్షలు, చర్యలు తప్పవని ఇప్పటికే హెచ్చరికలు జారీ చెయ్యడం గమనార్హం,
