సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ వచ్చే క్రిస్మస్ రోజులలో తెలుగు సినిమా మినీ సంక్రాంతి సినిమా ల తరహాలో మీడియం హీరోల సినిమాల భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్ లతో మంచి జోష్ ఫై నడవనుంది. మొదటగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ వారి హీరో నితిన్ నటిస్తోన్న యూనిక్ యాక్షన్, కామెడీ చిత్రం ‘రాబిన్‌హుడ్’. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకుడు. ఆస్ట్రేలియన్ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాని డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పర్యవేక్షణలో టాలీవుడ్ ప్రముఖ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘మ్యాజిక్’ అనే సినిమాను డిసెంబర్ 21న విడుదల చేస్తున్నారు ‘మ్యాజిక్’ చిత్రానికి సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ ) స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇక అక్కినేని వారసుడు నాగచైతన్య సాయి పల్లవి రెండోసారి తెరపై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరూ జంటగా ‘తండేల్’ (Thandel) సినిమా తెరకెక్కుతోంది. చందు మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు.ఇక పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నందీశ్వరుడు గా ప్రత్యేక పాత్రలో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. టాలీవుడ్ ప్రెస్టీజీయస్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న ‘కన్నప్ప’ చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వంటివారంతా భాగమైన సంగతి తెలిసిందే. ‘కన్నప్ప’ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్నిమహాభారత్ సీరియల్ పెం ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలపై మేకర్స్ దృష్టి పెట్టనున్నారు. డిసెంబర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
