సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: సంక్రాంతి పండుగకు ముందే ధాన్యం డబ్బులు ఇవ్వాలని భీమవరం యూటిఎప్ కార్యాలయంలోలో నేడు, ఆదివారం జరిగిన కౌలు రైతుల సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ సమావేశం జిల్లా ఉపాధ్యక్షలు కేతా గోపాలన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ,, జిల్లాలో అనేక కష్టాలు నష్టాలు ఎదుర్కొంటు పండిన పంటను అమ్ముకున్న రైతులకు నెలలు తరబడి డబ్బులు చెల్లించకపోవటం ధారుణమన్నారు.పంట మాసూలు నిమిత్తం యంత్రాలు, కూలీలు ఖర్చులు, పెట్టుబడికి తెచ్చిన అప్పులు చెల్లించే పరిస్థితి లేక కౌలు రైతులు తీవ్ర ఆర్టిక ఇబ్బుంధులకు గురౌతున్నరన్నారు. ఒక ప్రక్క పండుగ సమయం కావటం మరో ప్రక్క ధాళ్వా నాట్లు ప్రారంబిభం అవుతున్న ప్రభుత్వం ధాన్యం డబ్బులు వేయకపోవటంతో రైతు కుటుంబాల్లో పండుగ ఆనందమే లేదని ఆవేదన వ్యక్తంచేశారు
