సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాన్ ఇండియా మినహా డైరెక్ట్ తెలుగు సినిమా చరిత్రలో నెంబర్ వన్ కలెక్షన్ వసూళ్లు సాధించి వెంకిమామ సీనియర్ అగ్రహీరోలకే కాదు యువహీరోలు కూడా అందనంత ఎత్తుకు చేరుకొన్నారు. ఫ్యామిలీ సినిమాతో వస్తే తనను తట్టుకోలేరంటూ 300 కోట్ల పైగా కలెక్షన్స్ తో షాక్ కొట్టించిన విక్టరీ వెంకటేష్, వరుస హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో దిల్ రాజు నిర్మాణంలో ఈ సంక్రాంతికి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. రేసులో ఉన్న ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ చిత్రాల ఇప్పటికే OTT లో వచ్చేసాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ తో రూపాయికి 6రేట్లు లాభాలతో ఇప్పటికి ‘సంక్రాంతికి వస్తున్నాం మంచి కలెక్షన్స్ తో రియల్ బ్లాక్ బస్టర్‌గా దూసుకొనిపోతుంది. భీమవరంలో సైతం ఇప్పటికే 1కోటి 75 లక్షలు పైగా వసూళ్లు సాధించింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రైట్స్ ని భారీ ధరకు జీ 5(Zee 5). ఎవరు ఊహించనంత ధరకు కొనుగోలు చేసింది. ఈ నెల 26 వ తేదీన ఒటిటి లో మహాశివరాత్రికి రిలీజ్ చేసేందుకు అధికారికంగా ప్రకటిస్తారని భావిస్తున్నారు..
