సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పండుగ బరిలో కాస్త లేటుగా వచ్చిన లేటెస్టుగా భారీ పబ్లిసిటీ తో మంచి పాజిటివ్ లుక్ తో దూసుకొని నేడు, మంగళవారం పేక్షకుల వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాము’ విక్టరీ వెంకటేశ్‌కు బాగా కలిసొచ్చిన సీజన్. ఎన్నో చిత్రాలు సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయి. దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి తో గతంలో ఎఫ్–2, ఎఫ్ 3 సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయి 100 కోట్ల క్లబ్ లో చేరాయో అందరికి తెలిసిందే.. హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన ఈ సినిమా కధ విషయానికి వస్తే.. భార్య భర్తల మధ్య భర్త మాజీ ప్రియురాలు తిరిగి వస్తే వచ్చే రొటీన్ వినోదం తో పాటు కీలక కధ ఏమిటంటే.. అమెరికాలో ఓ పెద్ద కంపెనీ సీఈఓగా కొనసాగుతున్న వ్యక్తి సత్య ఆకెళ్ల (అవసరాల శ్రీనివాస్). అతనితో సొంత రాష్ట్రంలో నాలుగైదు మంచి కంపెనీలు పెట్టించి పేరు తెచ్చుకోవాలన్న ఆలోచనతో తెలంగాణ సీఎం కేశవ (నరేశ్ వీకే) తనని హైదరాబాద్‌కు తీసుకువస్తాడు. అతని సెక్యూరిటీ బాధ్యతల్ని మీనాక్షి (మీనాక్షి చౌదరి)కి అప్పగిస్తారు. అయితే సత్య నగరానికి రాగనే పాండే గ్యాంగ్ అతన్ని అపహరిస్తారు. అతన్ని కాపాడేందుకు సీఎం సపోర్ట్‌తో సస్పెన్షన్‌లో ఉన్న వై.డి.రాజు అలియాస్ చిన్నరాజు (వెంకటేష్)ను రంగంలోకి దించడానికి మీనాక్షి (మీనాక్షి చౌదరి) రాజమండ్రి వస్తుంది. ఈ మిషన్‌ను వారు ఎలా అధిగమించారు అన్నది కథ.. ఇక సినిమా ఎలా ఉందంటే.. క్రైమ్ కథతో ముడిపడిన కుటుంబ కథా సినిమా అనిల్ రావిపూడి ఏదో మ్యాజిక్ చేస్తాడని ప్రేక్షకుల నమ్మకం. నవ్వుల పువ్వులు పూయించారు. అసలు మైనస్ లు లేకుండా సినిమా పరుగులు పెట్టించాడు. . ఈ తరహా పాత్రలు వెంకీకి కొత్తేమీ కాదు.. బాధ్యతగల భర్తగా, మాజీ ప్రియుడిగా బ్యాలెన్స్‌డ్‌గా నటించారు. వెంకీ. మీనుతో ప్రేమ కథ బయటపడ్డాక ఇద్దరితో వేగే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. భాగ్యం పాత్ర ఐశర్యా రాజేశ్‌కు బంపర్ ఆఫర్. మీనాక్షి చౌదరి ఇందులో గ్లామర్‌గా మెప్పించింది. వెంకీ ఏజ్ గ్యాప్ అసలు ఎవరికీ గుర్తుకురాదు ఎవెంకీ తనయుడుగా నటించిన బాల నటుడు రేవంత్ పాత్ర సినిమాకు హైలైట్. వీటీవీ గణేష్, నరేష్ ట్రాక్ నవ్వించింది. ప్రస్తుతం భీమ్స్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ సినిమాకు చక్కని పాటలు, సంగీతం అందించారు. పాటలన్నీ ప్రేక్షకులు ఆదరణ పొందాయి కూడా .. టెక్నికల్‌గా చూస్తే సినిమా కాస్త వీక్. సెకెండాఫ్‌లో కాస్త కత్తెర వేసుంటే బావుంది. . అయితే ఈ పండగ సీజన్‌లో బ్లాక్‌బస్టర్ వెంకీ పాడిన సంక్రాంతి పాటను క్లైమాక్స్‌లో పెట్టారు. అది అదిరింది. పైగా సంక్రాంతి బరిలో విడుదలైన ఇతర చిత్రాల్లో ఇదే వినోదాత్మక చిత్రం కావడం సినిమాకు BIG ప్లస్.
