సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పండుగ అంటే తెలుగు రాష్ట్రాలలో అందరికి గుర్తుకువచ్చేది భీమవరం.. అక్కడ శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారి నెల రోజుల ఉత్సవాలకు తోడు,పంచారామ సోమేశ్వరుడు, గ్రామా గ్రామాన తిరునాళ్లను తలపించే కోడి పందాలు. అమెరికా లాస్ వేగాస్ ను తలపించేలా అన్ని వసతులల్తో జూద శాలలు.. ఇది తరతరాలుగా సంక్రాంతి సంప్రదాయం అని ఇక్కడి వారు భావిస్తారు. భీమవరం నియోజకవర్గంలో పండుగ కోసం వచ్చేవారికి సంక్రాంతి సినిమాలు, వినోద కార్యక్రమాలు, రాష్ట్ర స్థాయి కబాడీ పోటీలు ఉచిత ప్రవేశం ఉన్న రాయల్ క్రాఫ్ట్ బజార్, అదనపు వినోద బోనస్ లు. 4 రోజుల పాటు జరిగే సందడిలో ఎంతో దూరప్రాంతాల నుండి వచ్చే బంధువులు ప్రముఖులు వారికీ విందు వినోదాలతో పాటు ఆ 3 రోజులు కోడిపందాలు చూడటం అదో పండుగ మజా .. ఎప్పటిలానే సంక్రాంతి రోజుల్లో కోడిపందేలపై ఉక్కు పాదం మోపుతాం .. జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ.. జూదాలలో డబ్బు నష్టపోకండి అంటూ ప్రజలు మంచి కోరి పోలీసు అధికారులు చేసే హెచ్చరికలు చేస్తున్నప్పటికీ సంప్రదాయం చాటున ఈసారి కూడా కోడిపందాలు బరులు సిద్ధం అయ్యాయి.. నేటి బుధవారం మధ్యాహ్నం నుండి .భీమవరం ,ఉండి నియోజక వర్గ పరిధిలో పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున కోళ్లు తలపడతాయని భావిస్తున్నారు. కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయి.ఇప్పటికే భారీ బరులు సిద్ధం చేసుకొని ప్రస్తుతం అక్కడ సంక్రాంతి సాంసృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సినీ ప్రముఖులతో మ్యూజికల్ నైట్ లు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఈ పండుగ రోజులలో భీమవరం ప్రముఖులు రాజకీయాలకు అతీతంగా సహకరించుకొంటారని అందరికి తెలిసిందే. ఎలానూ రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు భీమవరం వారే.. ఇక చోటా మోట నేతల ఆధ్వర్యంలో కోడి పందాల బరులుకు, డింకీ పందాలకు భీమవరం పట్టణంలోని శివారు ప్రాంతలతో పాటు పెదగరువు, వెంప పాలకోడేరు, ఉండి, కాళ్ల మండలాల్లోని పలు ప్రాంతాలు ప్రసిద్ధి పొందాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖులు, సినిమా యాక్టర్స్ భీమవరం చేరుకొని హోటల్స్ , గెస్ట్ హౌస్ లలో దిగిపోయారు. అయితే ఈసారి గతానికి మరో 2 రేట్లు అన్న రీతిలో భీమవరం సంక్రాంతి సందడి లో పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాల నుండి వేలాది వాహనాలలో లక్షలాది మంది ఇక్కడికి చేరుకోవడంతో రోడ్లపై వాహనాల రద్దీ ఇసుక వేస్తె రాలదు అన్నంత రీతిలో ట్రాఫిక్ ఉంది. అదనపు పోలీసులు వచ్చి తమ విధులను నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *