సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తంతే .. సంక్రాంతి బూరెల బుట్టలో సోలోగా పడ్డారంటే ఇదే.. అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘బంగార్రాజు’. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవల పెద్ద సినిమాలన్నీ కోవిడ్ కారణంగా సంక్రాంతి రేస్ లోంచి తప్పుకోగా.. సోలోగా బరిలోకి దిగిన ‘బంగార్రాజు’ మూవీ మొదటి రోజు రూ. 17.5 కోట్లు కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. గత 4 ఏళ్లుగా సరైన హిట్ లేని నాగార్జునకు సినిమా దమ్ము ఎలాగునప్పటికీ మంచి హిట్ పడింది. నాగ్ అండ్ చైతూ మాస్ పెర్ఫార్మెన్స్, కృతి శెట్టి గ్లామర్ అపీరెన్స్.. సినిమాకి మంచి ఓపెనింగ్స్ ను తెచ్చిపెట్టాయి. మొత్తం ఈ రెండు రోజుల్లోనూ ‘బంగార్రాజు’ చిత్రం వాస్తవం ఏమో గని ఏకంగా రూ. 36కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్టు ట్విట్టర్ లో అఫీషియల్ గా ప్రకటించారు. ఆరేళ్ళ క్రితం సరిగ్గా సంక్రాంతి సీజన్ లోనే ఇదే డేట్లో రిలీజ్ అయిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం టోటల్ రన్ లో 50 కోట్ల హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసి నాగ్ కెరీర్ లో టాప్ గ్రాసర్ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ అయిన ‘బంగార్రాజు’ చిత్రం కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించడం విశేషమని చెప్పాలి. నాగార్జున, నాగచైతన్య తాతా మనవళ్ళుగా అందించిన వినోదాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *