సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగువారి ఇష్టమైన పండుగ సంక్రాంతి. మరి సంక్రాంతి సినిమాలు సందడి కూడా పండుగలో భాగమే.. స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ సుమారు 40 పైగా సంక్రాంతి సినిమాలు విడుదల చేసి పాడి పంటలు, బంగారు భూమి ,ఇద్దరు దొంగలు, అగ్ని పర్వతం, నెంబర్1, అమ్మదొంగ , సంప్రదాయం,వంటి ఎన్నో బంపర్ హిట్స్ కొట్టిన సంక్రాంతి మొనగాడుగా కృష్ణ కు పేరుంది. ఇక తరువాత తరంలో కూడా అగ్ర హీరోల మధ్య పోటీ సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నో సారులు పోటీ పడ్డ చిరంజీవి, బాలయ్య లు ఈ ఏడాది సంక్రాంతి బరిలో 12వ తేదీన వీరసింహారెడ్డి x వాల్తేరు వీరయ్య లుగా(13వ తేదీ) మరోసారి తలబడుతున్నారు. అయితే ఈ రెండు సినిమాలకు నిర్మాత మైత్రి మూవీస్ కావడం ఒక విశేషం అయితే ఇద్దరు సీనియర్ అగ్ర హీరోల సరసన శృతి హాసన్ నటించడం మరో విశేషం. ఈ రెండు సినిమాలకు ఫైట్ మాస్టర్ లు రామ్ లక్ష్మణ్ లే కావడం మరో విశేషం. ఇంకా ఎందరో సాంకేతిక నిపుణులు రెండు సినిమాలకు పనిచేసారు. అందుకే ఒకే వరలో 2 కత్తుల లాంటి సినిమాలు ఇవి. బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ తెరకెక్కించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’ చిరంజీవి హీరోగా, రవితేజ ప్రత్యేక పాత్రలో దర్శకుడు కె. బాబీ రూపొందించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య రెండు సినిమాలు విజయం సాదించాలని కోరుకొందాం.
