సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరో 10 రోజులలో సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ ని పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చే ప్రయాణికుల కోసం మొత్తం 134 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పా టు చేసారు. వీటిలో సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ , ఎక్స్ ప్రెస్ సర్వీసులుతో . 74 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ బస్సులు జనవరి 10 నుంచి 13 వరకు నాలుగు రోజుల పాటు హైదారాబాద్ నుంచి జిల్లాకు రాకపోకలు సాగిస్తాయి. జిల్లాల్లోనాలుగు డిపోలైన భీమవరం, తాడేపల్లిగూడెం , నరసాపురం, తణుకు బస్ స్టాండ్లకు ప్రయాణికులను చేరవేస్తాయి.పండుగ తర్వాత 16 నుంచి 19 వరకు జిల్లా నుంచి హైదరాబాద్కు 60 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసారు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ నుంచి భీమవరానికి మొత్తం 3 బస్సులు ఉండగా, వీటిలో సూపర్ లగ్జరీ 1, ఆల్ట్రా డీలక్స్ 2 బస్సులు, నర్సాపురానికి సూపర్ లగ్జరీ 1, తాడేపల్లిగూడెం కు సూపర్లగ్జరీ 1, ఆల్ట్రా డీలక్స్ 2 బస్సు లు, తణుకు లగ్జరీ 1 ఉన్నాయి. అలాగే 11న హైదరాబాద్ నుంచి భీమవరానికి సూపర్ లగ్జరీ 3, ఆల్ట్రా డీలక్స్ 6 బస్సు లు, నర్సాపురానికి సూపర్ లగ్జరీ 3, ఎక్స్ ప్రెస్లు 2, తాడేపల్లిగూడెం కు సూపర్లగ్జరీ 2, తణుకు లగ్జరీ 2, ఆల్ట్రాడీలక్స్ లు 4, 12వ తేదీ నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి భీమవరానికి సూపర్ లగ్జరీ 3, ఆల్ట్రా డీలక్స్ 6 బస్సులు ప్రత్యకంగా కేటాయించారు. ఇక హైదరాబాద్ బీహెచ్ఈఎల్, ఎం జీబీఎస్ నుంచి భీమవరానికి టికెట్ ధర రూ.720, నరసాపురానికి రూ.770, తాడేపల్లిగూడేనికి రూ.750, తణుకుకు రూ.780 చొప్పున నిర్ణయించారు.
