సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం తాడేపల్లి, వైసీపీ కేంద్ర కార్యా లయం లో మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పూర్తీ అవినీతిమయ పాలన ప్రజలకు కళ్ళకు కట్టినట్లు కనపడుతుందని అయిన కూడా కూటమి నేతలు తాము నిజాయితీపరులమనే భ్రమను ప్రజలకు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో ఎక్కడ చుసిన మద్యం బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి. పర్మిట్ రూములు వెలిశాయి. వాటిల్లో మద్యం ఎమ్మార్పీ రేట్ల కంటే అధిక రేట్లకు అమ్ముతున్నారు. ఉచిత ఇసుక పెద్ద మోసం.. ఇసుక అమ్మకాలతో గత ప్రభుత్వంలో ప్రతీ ఏడాది రూ .750 కోట్ల ఆదాయం వచ్చేది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక రేట్లు డబుల్ అయ్యాయి. కానీ, ఖజానాకు మాత్రం పైసా రావడం లేదు .ఎక్కడ చుసిన మాఫియాలు నడుస్తున్నాయి. అమరావతిలో నిర్మాణాల పేరుతో కోట్ల ప్రభుత్వ నిధులను దొరికినకాడికి దోచేస్తున్నారు. ఇక సంక్రాంతి పండుగకు కూటమి ఎమ్మెల్యే లు దగ్గరుండి జూదాలను నడిపించారు. రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గంలో ఇది జరిగింది. ఈ తతంగంతో సుమారు రూ .2 వేల కోట్లు చేతులు మారాయి. ఇందులో సీఎం, చంద్రబాబు, కూటమి నేతలు, పోలీసులు కూడా వాటాలేసుకున్నారు. జూదం అనేది చట్టబద్దమా?. ప్రభుత్వమే ప్రజలను తప్పుడు మార్గంలో దోచు కోవడం కిందకు రాదా?.. ఇది అవినీతి లూటీ కదా?అని జగన్ ప్రశ్నించారు. .
