సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఐ.పి.ఎస్ హృదయపూర్వక భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన ఈ పండుగ వేళ, భోగి మంటల్లో కేవలం పాత వస్తువులనే కాకుండా, మనిషిలోని దురలవాట్లను, చెడు ఆలోచనలను, వ్యసనాలను కూడా దహించివేసి, జీవితంలో నూతన వెలుగులకు ఆహ్వానం పలకాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. సంక్రాంతి పండుగ ముసుగులో జిల్లాలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు, పేకాట, గుండాట వంటి జూద క్రీడలు నిర్వహించడం, ఆడటం మరియు ఆడించడం చట్టరీత్యా పూర్తిగా నిషేధించబడ్డాయని తెలిపారు. పండుగ ఆనందం జూదం పాలై, కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకూడదన్న ఉద్దేశంతోనే పోలీస్ శాఖ కఠిన ఆంక్షలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. కోడి పందాల నిర్వహణకు తమ పొలాలను లేదా స్థలాలను అద్దెకు ఇచ్చే రైతులు, కోళ్లకు కత్తులు కట్టేవారు, ఆ కత్తులను తయారు చేసేవారు మరియు సరఫరా చేసే వారిపై కూడా చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *