సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ప్రతి ఏడాదిలోనే భీమవరం విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు బివి రాజు ఫౌండేషన్ చైర్మెన్ విష్ణు రాజు ముఖ్య అతిధిగా శ్రీ విష్ణు స్కూల్ ఆవరణంలో నిన్న, నేడు, గురువారం రెండు రోజులు పాటు భోగి మంటలను వేసి సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. తెలుగునాట సనాతనంగా వస్తున్నా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, రంగవల్లుల పోటీలు, సాంప్రదాయ వేడుకలు: సంప్రదాయ గంగిరెద్దుల కోలాహలం ఎడ్లబండ్ల సందడి రంగోలి సాంప్రదాయ నృత్యాలు బుర్రకథలు జానపద నృత్యాలు కోలాటం మరియు ఆటపాటలు ప్రదర్శనలు చిన్న చిన్న సెట్స్ వేసి మరి నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం నుండి గాలిపటాల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఎంతో ఉత్సహ పూరితంగా జరిగిన ఈ సంక్రాంతి వేడుకలలో విద్యార్థులు అధ్యాపక సిబ్బంది ఉత్సహపూరితంగా పాల్గొని పండుగ సందడి తెచ్చారు.
