సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈసారి సంక్రాంతి వేడుకలలో సినిమానిర్మాతలకు నోట్ల వర్షం కురుస్తుంటే.. ప్రేక్షకులకు మాత్రం వినోదం భారమైంది. భీమవరంలో సంక్రాతి సినిమాలు కలెక్షన్స్ దుమ్ము లేపుతున్నాయి. NDA కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుంచి సినిమా వాళ్లకు సినిమాలకు టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వటం ప్రభావం చూపింది.దీనితో సంక్రాంతి సినిమా చూడాలంటే ఏపీ ప్రేక్షకుడికి తడిపిమోపెడు అవుతుంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ భీమవరం టౌన్ మొత్తం మీద 5 రోజులకు 64లక్షల కలెక్షన్స్ , దాకు మహారాజ్ కు 3 రోజులకు 36 లక్షలు, ఇక వెంకటేష్ కెరీర్ లో భీమవరం అత్యధిక 7 థియేటర్స్ లో నిన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు రిలీజ్ అయ్యి 31 షోలకు 16 లక్షలు గ్రాస్ కలెక్షస్ వసూళ్లు చేసింది. సినిమాకు ఫ్యామిలీ సినిమాగా గుడ్ టాక్ రావడంతో నేడు కూడా25 షోల వరకు ప్రదర్శించే అవకాశం ఉంది. కాస్త లేటుగా సంక్రాంతి బరిలో దిగిన వెంకీ మామ సంక్రాంతి మొనగాడుగా గతంలో ఎఫ్ 2 తరువాత మరోసారి నిరూపించుకొనే అవకాశం కనపడుతుంది.వెంకీ సినిమా నేడు, బుధవారం కూడా పలు థియేటర్స్ లో ఉదయం 7 గంటలకు ప్రదర్శనలు ఉన్నపటికీ అవి హౌస్ ఫుల్ అయిపోవడం మరో హైలైట్.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 45 కోట్లు వసూళ్లు చెయ్యడం అందరిని నివ్వెరపరిచింది.నేడు, మరో 35 కోట్లు అవలీలగా దానికి కలుస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ కూడా పూర్తీ ఫుల్ అయ్యింది.
