సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతినెల ఒకటో తేదీన లబ్ధిదారులకు ఇళ్ల వద్దకు వెళ్లి పింఛను అందజేస్తున్నామని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. భీమవరం. బొక్కవారి పాలెంలో నేడు, శనివారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిలతో కలిసి మంత్రి రవికుమార్ పింఛన్లు పంపిణీ చేశారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అన్నీ అందుతున్నాయా స‌చివాల‌య సిబ్బంది స‌రిగా ఇస్తున్నారా? అంటూ ప్ర‌జ‌ల నుంచి స‌మాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పింఛన్ల అమలులో దేశంలోనే ఏపీ తొలి స్థానమని, సంక్షేమ ప‌థ‌కాల‌ అమలుకు కేరాఫ్ గా సీఎం చంద్ర‌బాబు నిలుస్తున్నార‌ని అన్నారు. రైతుల సంక్షేమానికి కూట‌మి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. జనసేన జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు, టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, కార్పొరేషన్లు చైర్మన్లు, డైరెక్టర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *