సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 2 రోజులు క్రితం భీమవరం పర్యటనలో విద్య శాఖ మంత్రి లోకేష్ రాష్ట్ర విద్య వ్యవస్థలో మార్పులు తెస్తానని ప్రకటించిన నేపథ్యంలో నేడు, బుధవారం ఏపీ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహించనుంది. ఎలానూ ఇంటర్ విద్యార్థులు ఇంజనీరింగ్ , ఇతర కేంద్ర ఉన్నత విద్యలు చదవాలంటే ఎంసెట్ , జేఈఈ పరీక్షలలో ర్యాంకులు సాదించవలసి ఉంది.
