సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వినాయక చవితి, దసరా నుండి కార్తీకమాసం వరకు భక్తుల వినియోగం మేరకు దిగుబడి లేకపోవడంతో భారీగా పెరిగిపోయిన కొబ్బరి కాయల ధరలు తాజగా దిగివస్తున్నాయి. ఏపీలో ఉభయ గోదావరి జిల్లాలలో కొబ్బరి పంట ఎక్కువగా ఉంటుందని అందరికి తెలిసిందే.. కొద్దీ నెలలుగా ఒక్కసారిగా కొబ్బరికాయ రేటు వెయ్యి కాయలు సైజు బట్టి 20- 25 వేల రూపాయలు పైగానే ధర పలకడంతో అటు రైతులు హర్షం వ్యక్తం చెయ్యగా రిటైల్ గా ఒకో కొబ్బరికాయ 30 నుండి 40 రూపాయలు వరకు అమ్మకాలు చేసారు. ఈ ధర సుమారు 5 నెలలు ఉన్నది. అయితే ఇటీవల మరలా ఒకేసారి కొబ్బరి ధర దిగి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం వెయ్యి కాయ ధర పది వేల రూపాయలు మాత్రమే ఉండటంతో రైతులు దిగాలు పడుతున్నారు, కొద్దీ నెలలుగా కొబ్బరి ధర పెరగడంతో వ్యాపారులు కూడా కొబ్బరి కాయలను లక్షల్లో గౌడాన్ లలో నిల్వ పెట్టారు. అయితే ఒకేసారి ధర పతనం కావడంతో వ్యాపారస్తుల్లో ఆందోళన నెలకొంది. కర్ణాటక ,కేరళ నుండి కాస్త దిగుమతులు తగ్గిస్తే కొబ్బరి మరల ధర పుంజుకొంటుందని వారి ఆశ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *