సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చాక ఏమిటో కానీ కొంతకాలంగా మాజీ సీఎం జగన్ మొదలు వైసీపీ మద్దతుదారులు ఫై ఆరోపణలు లెక్కలేనన్ని కేసులు అయితే పడుతున్నాయి. తిరుమల లడ్డు , విశాఖలో షిప్ లో వేలకోట్ల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం , మొదలు కాకినాడ షిప్ లో బియ్యం స్మగ్లింగ్ అంటూ పలు తీవ్ర ఆరోపణలు కానీఎదో జరిగిపోతుందని హడావిడి జరుగుతుంది. తీరా కేసులో సరైన బలం లేకపోవడం లేక ‘జగన్నాధ మహిమ’తో కానీ యాదృచ్చికంగా ఎవరిని పోలీసులు అరెస్ట్ చేయలేకపోవడం, ఒకవేళ అరెస్ట్ అయిన వారు బెయిల్ తో బయటకు వచ్చెయ్యడం అందరు గమనించే ఉంటారు. ఇది ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి భంగపాటుగానే పరిగణించాలి. అయితే కాస్తో కూస్తో ‘ఎమ్మెల్యే రఘురామా ఒక్కేడే’ ప్యూహాత్మకంగా తనను వేధించిన కేసులలో నిందితులను దోషులుగా నిలబెడ్తున్నారు. చట్టపరంగా వేటాడుతున్నారు. తాజగా సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల వ్యవహారంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తన పై నమోదైన తొమ్మిది కేసులు కొట్టివేయాలని భార్గవ్ రెడ్డి.. హైకోర్ట్‌ను ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశించింది. అంతే కాదు సజ్జల భార్గవకు రెండు వారాల పాటు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
