సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు లో అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్ హీరోగా సూపర్ హిట్ సినిమా ‘సత్యం’ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సూర్యకిరణ్ కన్ను మూశారు. ఎన్నో ఏళ్లుగా దర్శకుడిగా నిర్మాతగా..వ్యక్తిగత జీవితంలో కష్ట నష్టాలకు గురి అవుతూ .. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. మాస్టర్ సురేష్ పేరుతో 200లకు పైగా చిత్రాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించిన ఆయన తెలుగులో ‘సత్యం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఆయన పేరు సూర్యకిరణ్‌గా మార్చుకున్నారు. ఆ తర్వాత ‘ధన 51, ‘బ్రహ్మాస్త్రం’, ‘రాజుభాయ్’, ‘చాప్టర్ 6’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తమిళంలో వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన ‘అరసి’ చిత్రానికి ఆయనే దర్శకుడు. బిగ్ బాస్’ తెలుగు సీజన్ 4 లో కంటెస్టెంట్ హౌస్ లో అడుగుపెట్టారు. ప్రముఖ సినీ మరియు టి.వి నటి సుజిత( పసివాడి ప్రాణం) సూర్య కిరణ్ కు స్వయానా చెల్లి అవుతుంది. హీరోయిన్ కల్యాణిని ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. సూర్య కిరణ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
