సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi) నేడు, బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తి విమానాశ్రమం కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu),కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan), మంత్రి నారా లోకేష్ ( Lokesh) ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో కలసి రోడ్డు మార్గంలో ప్రశాంతి నిలయానికి ప్రధాని బయలు దేరి సాయి కుల్వంత్ హాల్‌లో సత్యసాయిబాబా మహాసమాధిని ( ఫై తాజా చిత్రంలో) దర్శించుకొన్నారు. తదుపరి హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల్లో ప్రధాని పాల్గొంటారు. ఇందులో భాగంగా రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలు ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. నేడుసాయికుల్వంతులో వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీసాయి సత్యనారాయణ సామూహిక వ్రతాలను నిర్వహించారు. సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. పుట్టపర్తిలో గత మంగళవారం సాయంత్రం అశేష భక్తులనడుమ శ్రీ సత్యసాయి స్వర్ణ విగ్రహము తో భారీ రథోత్సవం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *