సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: త 10 రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులతో సబ్దుగా కదలాడుతున్న దేశీయ సూచీలు ఎట్టకేలకు నేడు, మంగళవారం లాభాల బాట పట్టాయి. త్రైమాసిక ఫలితాల సీజన్ కావడం కూడా మార్కెట్లకు కలిసి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. ఐటీ, ఫార్మా రంగాలు నష్టాల్లో కొనసాగుతుండగా, బ్యాంకింగ్ రంగం లాభాలను ఆర్జిస్తోంది. గత సోమవారం ముగింపు (82, 253)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల బాట పట్టింది. ఒక దశలో దాదాపు 250 పాయింట్లు లాభపడి 82, 495 వద్ద గరిష్టానికి చేరింది. ప్రస్తుతం ఉదయం 10:40 గంటల సమయంలో సెన్సెక్స్ 208 పాయింట్ల లాభంతో 82, 462 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతానికి 77 పాయింట్ల లాభంతో 25, 159 వద్ద కొనసాగుతోంది.నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 236 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 295 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.93గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *