సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం కొయ్యే మోషేను రాజు చైర్మెన్ గా శాసనమండలి సమావేశాలలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మా హయాంలో జరిగిందంటే మా హయాంలో జరిగిందని కు మంత్రి నారా లోకేష్ కు వైసీపీ సబ్యులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక దశలో వైసీపీ సభ పక్ష నేత బొత్స సత్యనారాయణ.. లోకేష్ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసారు, తదుపరి బొత్స మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. శాసనమండలి లో మా సభ్యులు మాట్లాడుతున్నప్పుడు సందర్భం కాని అంశాలను మంత్రి నారా లోకేష్ సభలో తరచూ మాట్లాడుతున్నారని చెప్పారు. వైసీపీ నేతలను బెదిరించే విధంగా లోకేష్ మాట్లాడుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది. లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి. కూటమి వచ్చి 8 నెలలలో ఏమి చేసింది?లోకేష్ బెదిరింపులకు భయపడేది లేదు.. అవసరమైతే విచారణ చేసుకోవాలని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. గ్రూప్ 2 పరీక్షల్లో కూటమి ప్రభుత్వం అభ్యర్థులను మభ్యపెట్టిందని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు రాజకీయ అవగాహన లేదని.. ఆవేశంతో ఎదో వైసీపీ ఫై మాట్లాడి ఉంటారని బొత్స సత్యనారాయణ అన్నారు. పవన్ కల్యాణ్ కూటమి నుండి బయటకు వచ్చి ప్రతిపక్ష నేతగా అపోజిషన్‌లో ఉంటానంటే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. తమ ఎమ్మెల్యేలు తాము పదవులను కాపాడు కోవటానికి అసెంబ్లీకీ హాజరు కాలేదని ఇక్కడ ఎటువంటి పరిస్థితితులు ఎదుర్కోటానికి అయినా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం గత ప్రభుత్వం చేసిన విధ్వంసం అంటూ గవర్నర్ ప్రసంగించడం కరెక్ట్ కాదని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 21 యూనివర్సీటీ వీసీలలో 19 మందిని రాజీనామా చేయించారని అన్నారు. కూటమి ప్రభుత్వం బలవంతంగా వీసీలను రాజీనామా చేయించిందని మండిపడ్డారు. వీసీల రాజీనామాపై విచారణ జరిపించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
