సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రను ప్రపంచ వ్యాప్తం చేసిన సినిమా. బాహుబలి.. తెలుగు సినిమా అంటేనే (విదేశాలలో సైతం) అసలయిన భారతీయ సినిమా అన్న స్లోగన్ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను బ్రద్దలుకొట్టి చూపించిన సినిమా బాహుబలి.. ఎప్పుడో సింహాసం సినిమా తరువాత తెలుగుసినిమా పీవర్ దేశానికీ చాటిన సినిమా బాహుబలి సిరీస్.. పాకిస్తాన్ లో సైతం థియేటర్లు ముందు హౌస్ ఫుల్ బోర్డులు వేలాది జనాలు వారి మధ్య ప్రభాస్ భారీ కటౌట్.. ఇటువంటి సన్నివేశాలు మరోసారి ఊహించగలమా? దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ లాంటి స్టార్స్ అందరూ నటించారు.రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ చిత్రం రెండు భాగాలను కలిపి జక్కన్న బాహుబలి ది ఎపిక్ పేరుతో ఈ అక్టోబర్ 31 బ రి రిలీజ్ చేస్తున్నాడు. సుమారు 4 గంటల ఈ సినిమాలో సరికొత్తగా సన్నివేశాలు ఎడిటింగ్ తో పాటు ముందు రెండు భాగాల్లో లేని గతంలో చూపించని సీన్స్ ను యాడ్ చేసి సరికొత్త కధనముతో సినిమా నడుస్తుంది. అదే జక్కన్న మ్యాజిక్.. మరి ఈ సినిమా రీ రిలీజ్ లో ఎన్ని కోట్లు కొల్లగొట్టనుందో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *