సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సరైన హిట్ లేక విలవిలా లాడుతున్న అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా, మమ్మాటి ప్రధాన పాత్రలో అగ్ర దర్శకుడు సురేందర్‌రెడ్డి దర్శకత్వం లో 50 కోట్ల రూపాయలు పైగా ఖర్చుతో తెరకెక్కి న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ గత ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సా ఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయ్యింది. అఖిల్ గత సినిమాల కన్నా బాగా తక్కువ కలెక్షన్స్ ఈ సినిమా రాబట్టింది. సినిమా రిలీజ్ అయిన రెండు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేయనున్నట్లు హడావుడి చేసారు. అయితే, చివరి నిమిషం లో స్ట్రీమింగ్ విడుదలను వాయిదా వేశారు. అయితే నిర్మాతలు థియేటర్లో ప్రేక్షకులను నిరాశ పరిచిన ఏజెంట్ సినిమా ను వ్రతం చెడ్డా ఫలితం దక్కాలని .. అఖిల్ క్రేజ్ పెంచేలా పాన్ ఇండియా స్థాయిలో ఓటిటీ లో పెద్ద హిట్ చెయ్యాలని ప్లాన్ చేసారు. దీనికోసం ఓటీటీ వెర్షన్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలను తొలగించి, నిడివి కారణంగా గతంలో తొలగించిన మంచి సీన్స్ ను జోడించి సరికొత్త ఎడిటింగ్ తో సినిమా వెర్షన్ ను తయారు చేసి ఈ జూన్ నెల 23న’ సోనీలివ్’ ఫై తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘ఏజెంట్’ను స్ట్రీమింగ్ తీసుకురానున్నారు. అని తాజా సమాచారం.
